అసాద్యాలను సుసాధ్యం చెయ్యగలిగే అంత శక్తి మనసుకు ఉందా ? అని మీకు అనుమానం రావచ్చు.ఊదాహరణకు మన కంటికి కనిపించే సూర్యకిరనాలనే తీసుకుందాం . వేసవిలో నిప్పులు చెరిగే ఎండ అక్కర్లేదు , శీతాకాలపు నీరెండలో కూడా సూర్యకిరనాలను ఒక కుంభాకార దర్పణం గుండా పోనివ్వండి , అలా ఏకంచేసిన కిరణాలను ఒక కాగితం పడేలా చేసామనుకోండి .....ఏమవుతుంది ?కాసేపటికి కాగితం కాలిపోతుంది కదా ? చెల్లాచెదురుగా ఉన్నప్పుడు తమలో దయించగలిగే శక్తి ఉన్నా ,సూర్యకిరణాలు ఆ పని చేయలేఅకపోయాయి . కాని అవి ఎకమయినప్పుడు లేదా వాటిని మనం ఏకం చేసినప్పుడు అవి మంటను పుట్టించగాలిగాయి .
ఆ మంటను సద్వినియోగం చేయడమో లేదా సర్వ నాశనానికి వినియోగించడమో అది వివేకానికి సంబంధించిన విషయం !
అలాగే మన మనసుకున్న అసాధారణ శక్తి ని కూడా ఏకాగ్రం చేయకుండా, అనేక అనవసర అంశాల వైపు దృష్టిని, ఆలోచనలనూ పోనిస్తూ ఆ శక్తి వృధా చేసుకుంటున్నాం.
అందుకనే మామూలు రోజువారి పనులు చిన్నాచితకా పనులు తప్ప మనకు ఘనకార్యాలు సాధించే అంత "సీనులేదులే" అనుకుంటాం .అదే మనం చేస్తున్న పెద్ద పొరపాటు. కాదు కాదు ఘోరమయిన నేరం .
5, జూన్ 2009, శుక్రవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి